హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును బుధవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 2,322 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైంది.
తాజాగా మార్కుల లిస్టును బోర్డు వెబ్సైట్లో ఉంచింది. ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్సైట్లో తెలుపవచ్చని సూచించింది. మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని బోర్డు వెల్లడించింది.