హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు. దసరా తర్వాత డిగ్రీ కళాశాలలు నాలుగు రోజులు నిరవధిక బంద్ చేస్తే.. వారంలో ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకుండా మాట తప్పిందని విమర్శించారు. మంగళవారం నుంచి మళ్లీ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తామని.. పరీక్షలు బహిషరిస్తామని ప్రకటించడంతో.. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.