పర్వతగిరి, మార్చి 9: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో రైతులే ఎడ్లబండిలో ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లి పర్వతగిరి సబ్‌స్టేషన్‌కు చేర్చారు. ఆదివారం మరో ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చి వారే బిగించుకున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతోనే ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు మోటర్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరుతున్నారు.