పట్టుతప్పిన పోలీసింగ్
రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది.
- అదుపుతప్పిన శాంతిభద్రతలు
- ఆడబిడ్డలకు రక్షణ కరువు
- పోలీసుల తీరుపై విమర్శలు
- సివిల్ సెటిల్మెంట్లతో అభాసుపాలు
- నీరుగారిపోతున్న పోక్సో కేసులు
- కఠిన సెక్షన్లను పెట్టడంలో నిర్లక్ష్యం
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. పోలీస్ సిబ్బందిలో బాధ్యత, జవాబుదారీతనం కొరవడి దుండగులు పెట్రేగిపోతున్నారు. ప్రజా రక్షణను గాలికొదిలేసి, కొందరు అధికారులు వ్యక్తిగత లాభాల కోసం పాకులాడుతుండటంతో సామాన్యుడు పోలీస్ స్టేషన్ మెట్లెకాలంటేనే భయపడే దుస్థితి దాపురించింది. సెటిల్మెంట్ల అడ్డాగా పోలీస్స్టేషన్లు శాంతిభద్రతలను కాపాడాల్సిన కొందరు అధికారులు సివిల్ వివాదాలు, భూ తగాదాల్లో తలదూరుస్తూ రూ.కోట్లలో సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల డీజీపీ ఆఫీస్ కేంద్రంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని ఆదేశించారు.
నీరుగారిపోతున్న పోక్సో కేసులు..
నిర్భయ, పోక్సో చట్టాలను అమలు చేయడంలో పోలీసుశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిందితులు సులువుగా బెయిల్‌పై బయటకు వస్తున్నారు. షాబాద్ పోక్సో కేసులోనూ పోలీసుల నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులోనూ తాజాగా హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి హైప్రొఫైల్ కేసుల్లో సైతం నిందితులకు లీగల్ లూప్ హోల్స్ దొరకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్టేషన్ల వారీగా క్రైమ్ రివ్యూలు ఏవీ?
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ వచ్చిన తర్వాత ప్రతినెలా క్రైమ్ రివ్యూలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోవడంలేదు. హోం శాఖను సీఎం చూస్తున్నా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం పోలీస్ శాఖ పనితీరును వేలెత్తి చూపిస్తున్నాయి. అవినీతి కేసుల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ తర్వాత మూడోస్థానంలో పోలీసుశాఖ నిలిచింది.
సంవత్సరం కేసుల నమోదు అధికారుల అరెస్ట్
- 2024 =152 223
- 2025 =199 273
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

