హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్‌ను సకాలంలో చేపట్టాలని 2025లో పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ కోసం కొంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిజైన్ చేశారని గుర్తుచేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం కారణంగా వారంతా ఖాళీగా ఉంటున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా 12,000 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉండగా.. రాష్ట్రంలో 400 మంది వరకు కౌన్సెలింగ్ కోసం వేచి చూస్తున్నారని వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ప్రవేశ పరీక్ష జరుగగా.. ఈ ఏడాది మార్చిలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలిపారు. ఇన్ సర్వీస్ కోటా, పర్సంటైల్ తగ్గింపు, సీటు సరెండర్ విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాల్లో జాప్యంతో అభ్యర్థులకు పడిగాపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.