హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోటపై పటిష్ఠ ఏర్పాట్లుచేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం ఆమె గోలొండ కోటను సందర్శించారు. వేడుకల్లో మన సాంసృతిక వారసత్వం ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంసృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ తెలిపారు.ప్రజలకు అసౌక ర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను సీఎస్ ఆదేశించారు.కార్యక్రమం లో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధానకార్యదర్శి వికాస్‌రాజ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.