ఏడాదికే శాంతిభద్రతలు మటాష్.. అన్ని నేరాల్లోనూ టాప్-10లో తెలంగాణ
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే శాంతిభద్రతలు దా రుణంగా క్షీణించినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం అన్నిరకాల నేరాల్లోనూ తెలంగాణ టాప్-10 జాబితాలో ఉన్నది.
- మహిళలపై అఘాయిత్యాల్లో అగ్రస్థానం
- సైబర్ నేరాల్లోనూ మొదటి ర్యాంకు
- మానవ అక్రమ రవాణా, ఆర్థిక నేరాల్లోనూ టాప్
- తీవ్ర నేరాల్లో 3, రేప్ కేసుల్లో 9వ స్థానం
- కిడ్నాప్ కేసుల్లో 8వ స్థానం, పిల్లలపై నేరాల్లో 7వ స్థానం
- బాలలు చేసే నేరాల్లో 4వ స్థానం
- వృద్ధులపై నేరాల్లో 4వ స్థానం
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే శాంతిభద్రతలు దా రుణంగా క్షీణించినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం అన్నిరకాల నేరాల్లోనూ తెలంగాణ టాప్-10 జాబితాలో ఉన్నది. మహిళలపై అఘాయిత్యాలు, మానవ అక్ర మ రవాణా, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల్లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచింది. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 24,495 కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలోని ప్రతి లక్షమంది మహిళల్లో 128.6 మంది ఏదో రకమైన నేరంలో బాధితులుగా ఉన్నారు. ఇలాంటి నే రాల్లో ఢిల్లీ అత్యధికంగా 130.7 రేటుతో తెలంగాణ కంటే కొంచెం ముందున్నది. మహిళలపై నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 66,398 కేసులు నమోదైనప్పటికీ అకడ జనాభా ఎకువగా ఉండటం వల్ల నేరాల రేటు 58 శాతంగా ఉన్నది.
హ్యూమన్ ట్రాఫికింగ్‌లో టాప్
దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణాలో బాధితులు అధికంగా మహిళలేనని ఎన్సీఆర్బీ-2024 నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం మానవ అక్రమ రవాణా కేసుల్లో దాదాపు 20% వాటా తెలంగాణదేనని వెల్లడించింది. ఇకడ నేరాల రేటు (1.1) జాతీయ సగటు (0.2) కంటే ఏకంగా 5 రెట్లు ఎకువగా ఉన్నట్టు పేర్కొన్నది. మానవ అక్రమ రవాణాకు సంబంధించి తెలంగాణలో నమోదైన మొత్తం 423 కేసుల్లో 814 మంది బాధితులుగా ఉన్నారని, వీరిలో 792 మంది మహిళలేనని తెలిపింది. వీరిలో 770 మంది వ్యభిచారం చేయించేందుకు అక్రమంగా రవాణా చేయబడ్డారని, తెలంగాణ నుంచి రోజుకు సగటున ఇద్దరు మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారని ఎన్సీఆర్బీ కుండ బద్ధలుకొట్టింది. రేప్ కేసుల్లో తెలంగాణ 9వ స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది.
రోజుకు 70 మిస్సింగ్ కేసులు
తెలంగాణలో మిస్సింగ్ కేసులు కూడా అధికంగానే ఉన్నాయని, 2024లో రాష్ట్రవ్యాప్తంగా 25,554 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్రంలో సగటున రోజుకు 70 మంది, గంటకు ముగ్గురు చొప్పున అదృశ్యమయ్యారని, వారిలో 4,614 మంది ఆచూకీ నేటికీ లభించలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్రమైన నేరాల్లో తెలంగాణ 3వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఈ విభాగంలో ప్రతి లక్ష మంది జనాభాకు 161.6 నేరాల రేటుతో ఒడిశా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

