హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. విద్యాలయాలు, గురుకులాలు పునఃప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మూడు నెలలుగా నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పౌరసరఫరాలశాఖ జేసీ, డీఎం, విద్యాశాఖ ఎంఈవోలు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులతో కలిసి పరీక్షించాలని సూచించారు. బియ్యం నాణ్యత సరిగా లేకపోతే వెంటనే వాటిని మార్చి పాతబియ్యం సరఫరా చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు సివిల్ సైప్లె ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్స్తో పౌరసరఫరాలశాఖ భవన్లో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నెల రోజులుగా ఎఫ్సీఐ సీఎంఆర్ సేకరణను నిలిపివేసిన నేపథ్యంలో మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.