హైదరాబాద్: తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ అని చెప్పారు. తన దార్శనికతతో భవిష్యత్ సాగు, తాగునీటి అవసరాలకు అందేలా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, డిండి, కోయల్‌సాగర్, కడెం, పోచంపాడు, లోయర్ మానేరు మొదలైన ప్రాజెక్టులు ఆయన నిర్మించినవే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, ఉస్మానియా ఆసుపత్రి ఆయన కాలంలో రూపుదిద్దుకున్నవేనని గుర్తుచేశారు.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చేసిన కృషిని గౌరవిస్తూ ఏటా జూలై 11న ఆయన జయంతిని తెలంగాణ ఇంజినీర్స్ డేగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 2014 నుంచి ఏటా ఇదే తేదీన వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అలీ నవాజ్ జంగ్ బహాదుర్ జయంతి సందర్భంగా.. ఇంజినీర్లందరికీ తెలంగాణ ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ బిడ్డల ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్.
తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహాదుర్ గారు.. తన దార్శనికతతో భవిష్యత్ సాగు, తాగునీటి అవసరాలకు అందేలా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
ఉస్మాన్… pic.twitter.com/C2c7ULpydQ
— KTR (@KTRBRS) July 11, 2025