హైదరాబాద్, నవంబర్9 (నమస్తే తెలంగాణ): నవీన్‌యాదవ్ శరీరం మాత్రమే బీసీది అని, మెదడంతా రేవంత్‌రెడ్డిదేనని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారదన్ మహారాజ్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవీన్ ఒక యాదవ తోలు బొమ్మ అని, ఆడించేది మొత్తం రేవంత్‌రెడ్డినేనని విమర్శించారు.
నవీన్యాదవ్తో బీసీల ప్రయోజనాలు నెరవేరడం అసాధ్యమని పేర్కొన్నారు. నవీన్‌యాదవ్‌కు ఎవరైనా మద్దతిస్తే అది వారి వ్యక్తిగత సంఘాల తరఫునే అనేది గుర్తుంచుకోవాలని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రూ.వందల కోట్లు పంచుతున్నా నిరోధించకుండా ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్టు ఆరోపించారు.