హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రూ. 343.16 కోట్ల నిధులను కేజీబీవీల కోసం వెచ్చించనున్నట్టు ప్రకటనలో తెలిపారు.
475 కేజీబీవీల్లో ప్రహరీలు, టాయిలెట్లు, బాత్రూమ్లు, వాటర్సంప్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.243.16 కోట్లు, 120 కేజీబీవీల్లో మరమ్మతుల కోసం రూ.100 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు.