లక్ష్మణచాంద : గోదావరిలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నిర్మల్ జిల్లా సోన్ సమీపంలోని గోదావరి నదిలోని ద్వీపం వంటి ప్రాంతం తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని తలపిస్తున్నది.
ఇందులో కొంతమేరకు కోతకు గురై తెలంగాణ ఆకృతిగా రూపుదిద్దుకున్నది. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రకృతి ప్రేమికులు సోన్ బ్రిడ్జిపై నుంచి చూస్తూ సంబురపడుతున్నారు.