ఖైరతాబాద్, ఆగస్టు 14: లంబాడా ల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కా రు, వారికి ఒక్క మంత్రి పదవిని కూ డా కేటాయించకుండా అవమానిస్తున్నదని, తక్షణమే లంబాడాలకు మం త్రి పదవి ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం జాతీ య వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారా డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం లో 40 లక్షల మంది లంబాడా జనాభా ఉన్నదని, తమను ఏదో ఉద్ధరిస్తుందని కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తండాలను పంచాయతీలుగా మార్చారని, ప్రతి పంచాయతీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఆంధ్రా పెట్టుబడిదారీ విధానం వల్ల ఎస్సీ, ఎస్టీల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని నిరసిస్తూ ఈ నెల 29న రెండు కార్పొరేట్ విద్యాసంస్థలను ముట్టడిస్తామని, గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకుంటే అక్టోబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పారు.
నందినికి సాయమేది?
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఏషియన్ గేమ్స్‌లో కాం స్యం సాధించిన అగసార నందినికి సాయమెందుకివ్వలేదని రాష్ట్రప్రభుత్వా న్ని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. రెజ్లర్ ఫొగాట్‌కు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అండగా ఉంటామని చెప్పారని, కానీ రాష్ట్రంలో ఓ అథ్లెట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అథ్లెట్ అంటే సర్కారుకు చిన్నచూపా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్, ఈషాసింగ్ లాంటి వాళ్లతో పోలిస్తే నందిని పతకాలు తకువేం కాదని స్పష్టం చేశారు. కేవలం సంక్షేమ పాఠశాలలో చదివిందని, ఆమె తండ్రి ఇప్పటికీ రజక వృత్తిలో ఉన్నాడనే ఆమె విజయాలు కాంగ్రెస్ సర్కారుకు తక్కువగా కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. అందరిలాగానే తనకూ పారితోషికం, హైదరాబాదులో ఇంటిస్థలం కేటాయించమని నందిని సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. క్రీడాకారిణి నందినికి కూడా నగదు బహుమతి ఇవ్వాలని, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
హిమాయత్‌నగర్, ఆగస్టు 14: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సంఘ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన చేపట్టిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరిట బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేసి బీసీ యువతకు రూ.10 లక్షల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు గిరిగాని భిక్షపతి, దాసరిమూర్తి, సంయుక్త కార్యదర్శి సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర శ్రీహరి పాల్గొన్నారు.