Turmeric Board | ఏండ్ల తరబడి నిజామాబాద్ జిల్లా వాసులు కంటున్న కల సాకారమైంది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ వాసులకు ప్రధాని మోదీ సంక్రాంతి కానుక ఇచ్చినట్లయింది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా గంగారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరుగనున్నది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ .. వర్చువల్గా జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్నది. పలు దఫాలు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.