(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ‘మద్యం విధానం’ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. టీవీ చానళ్లు డిబెట్లు నిర్వహించాయి. కేసు దర్యాప్తునకు సంబంధించి ఈడీ, సీబీఐ వైఖరిపై మండిపడుతూ సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలనే హెడ్డింగ్స్గా ప్రచురించింది. ఈ కేసులో కవితకు ప్రమేయంలేదని, చివరకు న్యాయమే గెలించిందంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘కవిత’, ‘సత్యమేవజయతే’ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అయ్యాయి.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో..‘కాంగ్రెస్ పార్టీకి, వారి న్యాయవాదులకు కంగ్రాట్స్’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ కావడం, క్విడ్‌ప్రోకోగా ఆయన ఆరోపించారు. విలీనం మాట ముచ్చట పూర్తయింది ‘అప్పగింతలే’ తరువాయి అని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రి య కవితకు బెయిల్ ద్వారా మొదలైందని విమర్శించారు. ఢిల్లీలో కేటీఆర్, హరీశ్‌రావు బీజేపీ సీనియర్ నేతలతో పలు దఫాలుగా జరిపిన చర్చల ఫలితంగానే ఈడీ ఉదాసీనంగా బెయిల్ ఇచ్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వా న్ని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఇబ్బం ది పెట్టడానికి బీజేపీ, బీఆర్ఎస్ కూడగట్టుకొని ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు.