Karla Rajesh | పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్.. దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌పై తీవ్ర ఆగ్రహం
Karla Rajesh | తెలంగాణ పోలీసులపై జాతీయ మా నవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌పై మండిపడింది.
Karla Rajesh | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసులపై జాతీయ మా నవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌పై మండిపడింది. అతని కస్టడీ మరణంపై 3 వారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2025 నవంబర్ 16న కోదాడకు చెందిన కర్ల రాజేశ్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల దెబ్బలు తాళలేక దవాఖానలో చికిత్స పొందు తూ చనిపోయాడు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో చేయని తప్పునకు రాజేశ్‌ను తీసుకెళ్లి.. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాద వ్ పేరు చెప్పించాలని చిత్రవధకు గురిచేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ కుట్రలో అమాయకుడైన రాజేశ్‌ను బలి తీసుకున్నారు. తన బిడ్డను అప్పగించాలని 2025 నవంబర్ 4 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా, కనికరించకుండా తీవ్రంగా కొట్టినట్టు రాజేశ్ తల్లి కర్ల లలిత చెప్తున్నారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో పోలీసులే బలవంతంగా ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇప్పించారని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో రాజేశ్ లాకప్‌డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులకు న్యాయం చే యాలని ఎమ్మార్పీఎస్ సహా పలు దళిత సంఘాల నాయకులు పోరాడారు. వీరికి తోడుగా బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బాధితులకు అండగా నిలిచారు. కోదాడ వెళ్లి బాధితకుటుంబానికి భరోసా ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేంత వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
రాజేశ్ కస్టడీ మరణంపై మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఎన్హెచ్ఆర్సీ తలుపుతట్టారు. దీంతో ఈ కేసులో 3 వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఐదు రోజుల అక్రమ నిర్బంధం… థర్డ్ డిగ్రీ, చిత్రహింసలు, వాటిని తాళలేక చివరికి మృతి వంటి ఆరోపణలు కోదాడ పోలీసులపై ఉన్నా యి. కేవలం మాజీ ఎమ్మెల్యేపై తప్పు తేల్చేందుకు, అబద్ధ సాక్ష్యం చెప్పించేందుకు చిత్రహింసలా? అంటూ పోలీసుల పాత్రపై ఎన్హెచ్ఆర్సీ వివరణ కోరింది. ఆఖరికి మృతుని తల్లి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు కాలే దా? అని ప్రశ్నించింది. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హత్య కేసు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద బాధిత కు టుంబం చర్యలు కోరినా కూడా పోలీసులు ఎందుకు స్పందించలేదో చెప్పాలని సూచించింది. పోస్ట్‌మార్టం వీడియో నుంచి మెజిస్ట్రియల్ విచారణ వరకు అన్ని రికార్డులు సమర్పించాలని ఆదేశించింది. సూర్యాపేట ఎస్పీ, కలెక్టర్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. రాజేశ్‌ది కస్టడీ మరణమా? పోలీసుల హింసా? మరేదైనా సమస్యా? అనే విషయా లు, నిజానిజాలు తేల్చేందుకు ఎన్హెచ్ఆర్సీ కూడా ప్రత్యేకంగా విచారించే యోచనలో ఉ న్నట్టు తెలిపింది.రాజేశ్ మృతిపై తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ స్పందించిందా? స్పందిస్తే, ఎలాంటి చర్యలు తీసుకున్నదో ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

