హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పర్యావరణ అనుమతులపై కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. వివిధ ప్రాజెక్టుల వల్ల పర్యావరణంపై పడే ప్రభావంపై కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని ఎస్ఈఐఏఏ ఈ నెల 23న హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది.
ఆ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌ను తాజాగా విడుదల చేసింది.ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్న ప్రాంతంలోని 9 లొకేషన్లలో భూగర్భ, ఉపరితల జలాలు, మట్టి నమూనాలు సేకరించడంతోపాటు అకడ కనీసం ఒక సీజన్లోనైనా శబ్ధ కాలుష్యం తీరును అంచనా వేయాలని పేర్కొంది. కాగా, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనులను చేపట్టరాదని ఎన్జీటీ ఆదేశించింది.