హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల అదుపునకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘సమన్వయ ప్లాట్‌ఫామ్’ పురస్కారం దక్కింది. సైబర్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ నేరస్తుల నెట్‌వర్క్‌ను ఛేదించి, విచ్ఛిన్నం చేసే మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఐ4సీ తొలి వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. సైబర్ నేరాల అదుపులో విశేషంగా కృషి చేస్తున్న తెలంగాణ కీర్తిని కొనియాడి సమన్వయ పురస్కారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి బండి సంజయ్ ప్రదానం చేశా రు. రాష్ట్రం తరఫున సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్, ఎస్పీ దేవేందర్‌సింగ్ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ వారికి అభినందిదనలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుడు సైబర్ నేరాలపై ప్రజలకు పాఠాలు బోధిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌చేశారు. ‘సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండపానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. – హైదరాబాద్,
కేప్ కెనావెరల్: ప్రపంచ కుబేరుడు మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. అంతరిక్షంలో తొలిసారి బుధ లేదా గురువారాల్లో ప్రైవేట్ స్పేస్‌వాక్ నిర్వహించేందుకు నలుగురు వ్యోమగాములను ‘ఫాల్కన్-9’ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపింది.