Mall | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని మాల్ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు దక్కింది. ఈసారి రాష్ట్రం నుంచి ఈ ఒక్క గ్రామమే జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డ్ విభాగంలో మాల్ గ్రామం ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు కోటి రూపాయల ఆర్థిక ప్రోత్సాహకం కేం ద్రం నుంచి లభించనున్నది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం (నేడు) ఢిల్లీలో అవార్డును అందజేయనున్నారు.
కొత్తగా ైక్లెమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్ అవార్డ్, ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డ్, పంచాయత్ సామర్థ్య నిర్మాణ సర్వోత్తమ సంస్థ పురసారం ప్రవేశపెట్టారు. ఒక్కో విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులకు గ్రామాలను ఎంపిక చేశారు. 1వ స్థానం రూ.1 కోటి, 2వ స్థానం రూ.75 లక్షలు, 3వ స్థానానికి రూ.50 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తారు.