హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : జేఈఈ-2025 మెయిన్స్-1 ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి బణిబ్రత మాజి(అప్లికేషన్ నంబర్ : 250310746461) 300 మార్కులకు 300 సాధించి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఆయుష్ సింఘాల్(250310009213), కుషాగ్ర గుప్తా(250310034720), విషద్జైన్(250310299968), షివిన్ వికాస్ (250310391420) 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా 14 మంది 100 పర్సంటైల్ సాధించగా, వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఉన్నట్టు విద్యాస్థంస్థల డైరెక్టర్లు సింధూరనారాయణ, శరణినారాయణ తెలిపారు. అలాగే 8 రాష్ర్టాల్లో స్టేట్ టాపర్స్‌గా నిలిచినట్టు చెప్పారు. వీరిలో ఎక్కువగా నారాయణ స్కూళ్లలో చదివిన వారే అని స్పష్టంచేశారు. ఇంతటి రికార్డు సాధించిన విద్యార్థులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.
శ్రీచైతన్య సంచలనం..
జేఈఈ మెయిన్స్-1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు సంచలనం సృష్టించాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అత్యధికంగా 42 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. అలాగే మల్టిపుల్ సబ్జెక్టుల్లో 8 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి సుష్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సబ్జెక్టుల పర్సంటైల్లోనూ అత్యధికంగా 100 పర్సంటైల్ సాధించిన ఘనత శ్రీచైతన్యదే అని స్పష్టంచేశారు. ఇంతటి ఘనత సాధించిన తమ విద్యార్థులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. దేశంలోనే టాప్ ఫ్యాకల్టీ శిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమైనట్టు వెల్లడించారు.
ఎస్సార్ విజయకేతనం..
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: జేఈఈ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేసినట్టు విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వల్లాల నాగసిద్దార్థ(ఫిజిక్స్‌లో 99.97 పర్సంటైల్) సాధించి ఎస్సార్ కీర్తిప్రతిష్ఠను జాతీయస్థాయిలో నిలబెట్టినట్టు చెప్పారు. తాడిపర్తి తేజస్ ఉద్భవ్‌రెడ్డి(99.83), మారం రాజవర్షిత్‌రెడ్డి(99.81), దిడ్డి ప్రజ్వల్కుమార్ (99.77), యాద భరణిశంకర్ (99.77), చల్లా అన్సిక(99.66), మేడ కార్తీక్(99.66), జోగు అభిరాం(99.60), కడారి సంజయ్ (99.58), చిన్ని కమలావర్ధన్(99.58)తోపాటు మొత్తం 25 మంది విద్యార్థులు 99 పర్సంటైల్ సాధించినట్టు వివరించారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, అధ్యాపకులు, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు.