Digital Addiction | హైదరాబాద్ : విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన నారాయణ, గైడ్కాస్ట్లోని నాలుగో ఎపిసోడ్‌ను డిజిటల్ డిపెండెన్సీ అండ్ అడిక్షన్ పేరుతో యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. ఈ ఎపిపోడ్ పిల్లలలో పెరుగుతున్న డిజిటల్ డిపెండెన్సీ సమస్యపై, వారి మానసిక భావోద్వేగ పరిస్థితులపై పడుతున్న ప్రభావాల గురించి వివరించారు.
ఈ కాలం పిల్లల్లో డిజిటల్ పరికరాల దుర్వినియోగం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. 2022లో ఒక సంస్థ జరిపిన సర్వేలో 9-13 ఏండ్ల వయసు గల 27 శాతం మంది పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రోజు సగటున 3 నుంచి 4 గంటలు ఆన్లైన్లో గడుపుతున్నారని వెల్లడైంది. 12 నుంచి 15 ఏండ్ల వయసు గల పిల్లల్లో 87 శాతం మంది, 6 నుంచి 11 ఏండ్ల వయసు గల పిల్లల్లో 80 శాతం మంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పెరిగిన సాంకేతికతతో కలిగే ప్రయోజనాలతో పాటు అధిక వినియోగం వలన కలిగే దుష్ప్రరిణామాలపై తక్షణం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
డిజిటల్ సాధనాలు తెలివిగా ఉపయోగించుకునే వారికి నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయి. సమాచారం, నెట్ వర్కింగ్, విద్యాసంబంధమైన వనరులకు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అధిక సమయం డిజిటిల్ వినియోగం ద్వారా పిల్లలపై దుష్ప్రరిణామాలను తల్లిదండ్రులకు తెలియజేయాలనేది ఈ పాడ్ కాస్ట్ ముఖ్య ఉద్దేశం. అధిక సమయంలో స్మార్ట్ ఫోన్లలో వినియోగించడం కారణంగా పిల్లల సామాజిక ఎదుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. గాడ్జెట్లను అతిగా ఎక్స్పోజర్ చేయడం వల్ల మెదడు పనితీరు తగ్గిపోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా నిద్రకు అంతరాయం కలుగుతుందని వివరించారు.
ఈ క్రమంలో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు నారాయణ దిశా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2017లో సైకాలజిస్ట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం అనేక విధాలుగా సేవలందిస్తుంది. 100 మందికి పైగా సైకాలజిస్టులతో 283 పాఠశాలలు, 279 కాలేజీల్లో దిశ సేవలందించింది. ఏడాదికి 3,500లకు పైగా విద్యార్థులతో ముఖాముఖి చర్చలు నిర్వహించింది. గతేడాది 3 లక్షల మంది విద్యార్థులకు మద్దతుగా నిలిచింది. సుమారు 15 వేల మందికి వ్యక్తిగతం సేవలందించింది అని నారాయణ గ్రూప్ ఎండీలు డాక్టర్ పి సింధూ నారాయణ, శరణి నారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి: హరీశ్ రావు
HYDRAA | పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నం.. కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు..
Congress | అధిష్ఠానానికి 650 కోట్లు?.. సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుడు!