హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): నారాయణ విద్యాసంస్థలు తమ 47 ఏండ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 38 కొత్త క్యాంపస్‌లను ప్రారంభిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ భారీ విస్తరణ చేపడుతున్నట్టు సంస్థ వెల్లడించింది. కొత్త క్యాంపస్‌ల ఏర్పాటుతో ఏపీలో మొత్తం క్యాంపస్‌ల సంఖ్య 407కు, తెలంగాణలో 244కు చేరుకుంటాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల మొత్తం క్యాంపస్‌ల సంఖ్య 952కు చేరుకుంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల ప్రెసిడెంట్ పునీత్ కొత్తప మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నారాయణ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.