TDP Mahanadu | వరంగల్, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణపై తెలుగుదేశం పార్టీ మరో కుట్రకు తెరలేపింది. ఒకవైపు బనకచర్ల వంకతో గోదావరి, కృష్ణా జలాలను ఎత్తుకపో యే కుతంత్రానికి తెరలేపుతున్న చంద్రబా బు.. ఇప్పుడు మనవేలితో మన కన్నునే పొడువాలనే ఎత్తుగడ వేసిండా? గోదావరి, కృష్ణ న దీజలాల వాటా అడుగటం ఎందుకు ఏకంగా తెలంగాణ అస్తిత్వాన్నే పొతం పట్టిస్తే సరిపోతుందని కలలు కంటున్నాడా? అంటే మంగళగిరి మహానాడు సాక్షిగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
‘2014లో రాష్ర్టాన్ని విభజించి కట్టుబట్టలతో మెడపట్టి గెంటేశారు’ అని నిన్నామొన్నటి దాకా విషం కక్కిన నారా లోకేశ్ బుధవారం ఏకంగా అండమాన్‌లోనే కాదు తెలంగాణలోనూ టీడీపీ విస్తరించే బాధ్యత తీసుకుంటానని శపథం చేశా రు. అంతకన్నా ముందు టీడీపీ తెలంగాణ అ డ్హక్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బక్కని నర్సింహులు చేత అసలు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదని ప్రకటింపజేశారు. తన రెండు కండ్ల నిండా ఇంకా పచ్చని విషం మిగిలే ఉన్నదని నిరూపించుకున్నారని, వారిని వారించని చంద్రబాబు వైఖరిపై తెలంగాణ సమాజం అట్టుడుకుతున్నది. చంద్రబాబు మరోకుట్రకు తెరలేపారని, అందుకే తన బానిసలతో తెలంగాణ అస్తిత్వాన్ని కాటగలింపేందుకు భారీ కుట్రకు తెరలేపారని, దీనిని అడ్డుకోకపోతే తెలంగాణ మళ్లీ తీరని అన్యాయానికి గురవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు
– బక్కని నర్సింహులు pic.twitter.com/cYHOO1dS9D
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
రాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏండ్లు గడుస్తు న్నా చంద్రబాబు ఆత్మ ఇంకా తెలంగాణ చు ట్టూ దయ్యమై తిరుగుతున్నదని బీఆర్ఎస్ నే తలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో దేశానికే దిక్సూచిలా తెలంగాణ తలెత్తుకొని నిలిచిన చరిత్రను చూసి ఆ పదేండ్లు ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే హడలిపోయిన బాబు అండ్ కో ఇప్పుడు తన శిష్యుని ఏలుబడిని అడ్డు పెట్టుకొని మళ్లీ పాగావేయాలని చూ స్తున్నదని, ఆ ఆటలు సాగవని బీఆర్ఎస్ తేల్చిచెబుతున్నది.
‘తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రాకు కొన్ని పదాలు ఉన్నవి. తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ, కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ విద్వేషాలు తెచ్చి అ నేక మంది కష్టపడ్డవాళ్ల జీవితాల్లో మన్నుపోసిండ్రు’ అని బక్కని నర్సింహులు పేర్కొన్నా రు. మంగళగిరిలో మహానాడులో ఈ వ్యాఖ్య లు తెలంగాణలో అగ్గిరాజేస్తున్నాయి. ఈ వ్యా ఖ్యలు చేస్తున్నప్పుడు వేదికపై చంద్రబాబు ముసిముసి నవ్వులు విసరగా, తన స్క్రిప్ట్‌ను అద్భుతంగా వల్లెవేస్తున్నారనే మహదానందంలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, నర్సింహులు చంద్రబాబు మెప్పుపొందేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటు అని, అసలా వ్యాఖ్యలు చేయించిందే చంద్రబాబు అనే వాదన వినిపిస్తున్నది.
‘అండమాన్, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా.. ఆ బాధ్యత నాదే’ అదే మంగళగిరి వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. లోకేశ్ నిన్నామొన్నటి దాకా చేసిన వ్యాఖ్యలకు తాజా ప్రకటనకు మధ్య ఏం అద్భుతం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. తమను మెడపట్టుకొని గెంటేసిన తెలంగాణలో లోకేశ్‌కు ఎవరు పచ్చ తివాచీ పరుస్తున్నారో, తెరవెనుక పాత్రధారులెవరో అందరికీ తెలుసని, గురువు కోసం శిష్యుడు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ‘బాబూ నారా లోకేశ్ దమ్ముంటే ఇక్కడ రెండోసారి అధికారంలోకి రండి.. అదీ పొత్తు లేకుండా’ అని నెటిజెన్లు చాలెంజ్ విసిరారు. ‘15 ఏండ్లపాటు ఏపీలో పొత్తులో ఉంటామన్నారు. దీనికి అర్థం ఆంధ్రాలో టీడీపీ బలంగా లేదనే కదా! అలాంటప్పుడు తెలంగాణలో దివాలా తీసిన దుకాణాన్ని ఎవరు నమ్ముతారు’ అని ఏకిపారేశారు. మొత్తం మీద మంగళగిరి వేదికగా టీడీపీ వ్యవహరిస్తున్న వైఖరిపై తెలంగాణ సమాజం ఆగ్రహిస్తున్నది.
తెలంగాణపై చులకనగా మాట్లాడిన బక్కని నర్సింహులు వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బాబు మెప్పు కోస మే నర్సింహులు తెలంగాణ గురించి చులకన గా మాట్లాడారని విమర్శించారు. నాడు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధిస్తామని అప్ప టి మంత్రి యనమల ఇలాగే వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. సమైక్యవాది చంద్రబాబుతో జై తెలంగాణ అని అనిపించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని గుర్తుచేశారు. అసలు తెలంగాణలో టీడీపీ ఆఫీసు ఎందుకని ప్రశ్నించారు.
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): పురిటిగడ్డను మరిస్తే పుట్టగతులుండవని, ఇప్పటికే చాలామంది పుట్టగతుల్లేకుండా పోయారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. షాద్నగర్గడ్డలో పుట్టి, తెలంగాణ మ ట్టిలో పెరిగి చంద్రబాబు మెప్పు కోసం బకని నర్సింహులు ‘డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు’ అని వ్యాఖ్యానించడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఇది ఆయన అజ్ఞానమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, చరిత్రను, ఉద్యమాన్ని అవమానించడమేనని విమర్శించారు. ‘తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు కానీ మా రక్తంలో దాగి ఉన్నది’ అని స్పష్టంచేశారు. నర్సిం హులు లాంటివాళ్లు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.