కరీమాబాద్, అక్టోబర్ 19: బీఆర్ఎస్కు కార్యకర్తలే కొండంత బలమని వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం వరంగల్ 42వ డివిజన్లో కాంగ్రెస్ నుంచి 100 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి నన్నపునేని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల నిర్ణయం మేరకే ఇతరులను బీఆర్ఎస్లో చేర్చుకుంటామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హామీలు అమలు చేసే వరకూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.