హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మూసీ నిర్వాసితుల కోసం నందనవనంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నందనవనంలో మూసీ నిర్వాసితులకు కేటాయించేందుకు అప్పటి ప్రభుత్వం ఇండ్లను నిర్మించింది. ఇవి ఆక్రమణకు గురికావడంతో బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య, కేటాయింపులపై మం త్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, ప్రజావాణి నోడల్ అధికారి డి దివ్య, ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా విధులు నిర్వర్తించిన డాక్టర్ ఎస్ హరీశ్, కే శశాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. అక్రమంగా ప్రభుత్వ ఇం డ్లను ఆక్రమించుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కబ్జాదారుల నుంచి ఇల్లు విడిపించి బాధితులకు న్యా యం చేయాలని సూచించారు. దాదాపు 20 ఎకరాల్లో ఉండే నందనవనంలో కొంతమంది నిరుపేదలు గూడు నిర్మించుకున్నారు. గతంలో వాళ్లను ఖాళీ చేయించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ అక్కడి జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ చ్చింది. దీంతో నాటి సర్కార్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు సర్కార్ కూడా అదే ప్రయత్నం చేయబోతుండటంతో పేద లు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయని అధికారులు చర్చించుకుంటున్నారు.