తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 10: తొమ్మిది రోజులపాటు వినియోగదారులకు లక్కీడ్రాతో బహుమతులు అందించి, అమ్మకందారుల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజా గురువారం ఘనంగా ముగిసింది. ఆఖరి రోజు లకిడీకాపూల్‌లోని కున్ హుందాయ్ షోరూమ్‌లో చివరి లక్కీ డ్రా ఆసక్తిగా జరిగింది. వ్యాపారులు, వినియోగదారులకు మధ్య సంధానకర్తగా కొత్త ఒరవడికి శ్రీకారంచుడుతూ.. పదేండ్లుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు సంయుక్తంగా చేపట్టిన షాపింగ్ బొనాంజాకు అనూహ్య స్పందన లభించింది. పండుగల నేపథ్యంలో సామాజిక ధృక్పథంతో వ్యాపారస్తుల ఉత్పత్తుల అమ్మకాలను, సేవలను పెంచేందుకు కస్టమర్లకు ప్రత్యేకంగా కూపన్లను అందించి ప్రతీ రోజు డ్రా ద్వారా బహుమతులను అందించింది. ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ వరకు తొమ్మిది రోజుల పాటు నగరంలో ఎంపిక చేసిన షాష్లలో కొనుగోలు చేసిన కస్టమర్లను ప్రోత్సహిస్తూ ప్రతి రోజు డ్రా తీసి బహుమతులను అందించారు. ముగింపు లక్కీడ్రా విజేతలుగా కున్ హుందాయ్ షోరూమ్ కస్టమర్ శశికళ మన్నాలీ (011258), సయ్యద్ అలీదొద్దీన్(006347), బి. జయరాజ్(038976) నిలిచి బహుమతులకు ఎంపికయ్యారు. కున్ హుందాయ్ సీవోవో ఎస్ అశోక్ యాదవ్, బిజినెస్ హెడ్ జీ రాఘవేందర్‌రెడ్డి, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అడ్వర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్‌రావు, మేనేజర్ ఎస్ సురేందర్‌రెడ్డి పాల్గొని విజేతలను ఎంపిక చేశారు.\
పండుగ సమయాల్లో ప్రజలను ప్రోత్సహిస్తూ కొనుగోళ్లు పెరిగేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వ్యాపార సంస్థలకు తోడ్పాటును అందించడం హర్షించదగిన విషయం. పదేండ్లుగా లక్కీ డ్రాల ద్వారా స్వచ్ఛందంగా వినియోగదారులకు బహుమతులు అందిస్తూ ముమ్మలను ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు తాము సిద్ధంగా ఉన్నాము.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని పదేండ్లుగా దసరా బొనాంజాలో పాల్గొని విజయవంతం చేస్తున్న స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. తొమ్మిది రోజులుగా ప్రతీ రోజు లక్కీ డ్రా తీస్తూ పారదర్శకంగా ముగ్గురు కస్టమర్లకు బహుమతులను అందిస్తున్నాం. లక్కీ డ్రా ద్వారా తొమ్మిది మందికి స్మార్ట్ఫోన్లు, తొమ్మిది మందికి ఎల్ఈడీ టీవీలు, మరో తొమ్మిది మందికి గిఫ్ట్ ఓచర్లను అందించాం. గురువారం కొనుగోలు చేసిన కస్టమర్ల కూపన్ల నుంచి ముగ్గురిని లక్కీ డ్రా ద్వారా బహుమతులకు ఎంపిక చేశాం. కొనుగోలుదారులకు అమ్మకందారులకు అనుసంధానంతో స్వచ్ఛందంగా బహుమతులను అందిస్తున్నాం.