వైటీపీఎస్ను ప్రైవేట్‌కు అప్పగించొద్దు.. భూనిర్వాసితులకు అండగా ఉంటాం : నల్లమోతు భాసర్‌రావు
తెలంగాణకు తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
మిర్యాలగూడ, జూన్ 12: తెలంగాణకు తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి మొదటిసారి తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్య, పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిస్తూ చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. ఇం దులో భాగంగానే నియోజకవర్గానికి పెద్దపీట వేస్తూ సుమారు రూ.30 వేల కోట్లతో మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌ను మంజూరు చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, స్థానికంగా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక మహత్తర జీవనాధారమని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పాలకులు ఈ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయడమేంటే, రాష్ట్ర సంపదను లూటీ చేయడమేనని మండిపడ్డారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో ఇకడి రైతులు, గిరిజనులు తమ పిల్లల భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారని పేర్కొన్నారు. నాడు భూసేకరణలో రాష్ట్రంలో ఎకడా లేనివిధంగా నిర్వాసితులకు న్యాయం చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని, ఇంకా 700 మందికి ఉద్యోగాలు ఇవ్వాల లని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎండీ యూసుఫ్, కుందూరు వీరకోటిరెడ్డి, రాయికింది సైదులు, సోము సైదిరెడ్డి, గుగులోత్ వీరబాబు, కొండారపు బ్రదర్స్, కందుల నాగిరెడ్డి, కొనకంచి సత్యనారాయణ, బైరం గోపి, కోటయ్య, నర్సయ్య, రమావత్ వినోద్ నాయక్, బంగారు సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

