నల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన ర్యాలీలో నిరుద్యోగులు ఎవరూ లేరని కాంగ్రెస్ కు చెందిన రాజకీయ నిరుద్యోగులే ఉన్నారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Mla Bhupal Reddy), జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ఆరోపించారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) కలిసి మెలిసి ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారని విమర్శించారు.
ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komatireddy) మంత్రిగా పనిచేసిన సమయంలో జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఐటీ హబ్(IT Hub) ను, బత్తాయి మార్కెట్‌ను, మెడికల్ కాలేజీ(Medical College)ని ఎందుకు తీసుకురాలేక పోయారని ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడమే కోమటిరెడ్డికి తెలుసని దుయ్యబట్టారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లాకు శూన్యహస్తం చూపారని,ఈ విషయంలో తాను నిరూపించడానికి సిద్ధమని లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా కు సిద్ధమన్నారు. నల్లగొండను దత్తతు తీసుకుంటానని ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్(CM KCR) నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు.75 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణం, ఎన్జీ కాలేజీ, 110 కోట్లతో మెడికల్ కాలేజీ , బత్తాయి మార్కెట్ ఏర్పాటు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్(KTR), జగదీశ్ రెడ్డి(Jagadish reddy) చేసినవేనని వెల్లడించారు.
కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటు వేయమంటావ్. ఇదేనా సంస్కారమంటూ కోమటి రెడ్డిపై ధ్వజమెత్తారు. మంత్రి జగదీశ్‌రెడ్డి గురుంచి మాట్లాడే అర్హత లేదని వారు పేర్కొన్నారు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని వెల్లడించారు.