నల్లగొండ ప్రతినిధి, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాం కు చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై అవిశ్వాసానికి కాంగ్రె స్ పార్టీ తెరలేపింది. ఎన్నికలకు మరో ఏడునెలలే గడువున్నా చైర్మన్ కుర్చీ కోసం ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌తోపాటు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇం దులో కీలక వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
మునుగోడు పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డిని చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 14 మంది డైరెక్టర్లు సంతకం చేసి జిల్లా సహకార అధికారి కిరణ్‌కుమార్‌కు అందజేశారు. వెంటనే స్పందించిన అధికారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఈ నెల 20న గడువుగా ప్రకటించారు.