నైనీ కోల్‌బ్లాక్‌లో నయా సవాళ్లు
తెలంగాణ వెలుపల తొలిసారిగా సింగరేణి సంస్థ దక్కించుకున్న ప్రాజెక్ట్ నైనీ కోల్‌బ్లాక్. ఇందులో ఉత్పత్తి ప్రారంభించే క్రమంలో ప్రధానంగా ఆరు సవాళ్లు సింగరేణికి ప్రతిబంధకంగా మారాయి.
- ఒడిశా సర్కారు సహకారమే కీలకం
- ఉత్పత్తి ప్రారంభానికి 3 నెలలు గడువుగా పెట్టుకున్న సింగరేణి
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వెలుపల తొలిసారిగా సింగరేణి సంస్థ దక్కించుకున్న ప్రాజెక్ట్ నైనీ కోల్‌బ్లాక్. ఇందులో ఉత్పత్తి ప్రారంభించే క్రమంలో ప్రధానంగా ఆరు సవాళ్లు సింగరేణికి ప్రతిబంధకంగా మారాయి. వీలైనంత వేగంగా వీటిని పరిష్కరించుకునే దిశగా సంస్థ కసరత్తు చేస్తున్నది. నైనీ కోల్బ్లాక్కు ఇటీవల ఒడిశా సర్కారు 643 హెక్టార్ల భూమిని కేటాయించింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి కీలక ముందడుగు పడినట్లయ్యింది.
మరో ఆరు సమస్యలు మాత్రం అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఇందుకు ఒడిశా సర్కారు సహకారమే కీలకంగా మారింది. దీంతో ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధనశాఖ సెక్రటరీ రోనాల్డ్‌రోస్, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ఒడిశా సీఎం సహా ఇతర అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సవాళ్లను అధిగమించి మూడు నెలల్లోపే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
సవాళ్లు ఇవే..
- స్టేజ్ -2 అనుమతుల్లో భాగంగా 783.27 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి కేటాయించారు. ఈ భూమిని కేటాయించే ముందు ఈ స్థలంలోని చెట్ల లెక్కింపు జరగాలి. ఆయా చెట్లను తొలగించి అటవీశాఖ స్థలాన్ని సింగరేణికి అప్పగించాలి.
- నైనీ బొగ్గు బ్లాక్‌లోని ఓ గ్రామాన్ని పూర్తిగా తరలించాల్సి ఉంది. గ్రామస్థులకు ఆర్అండ్ఆర్ తదితర అంశాలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రిహాబిలిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంది.
- నైనీ బొగ్గు బ్లాక్‌కు మొత్తం 912. 79 హెక్టార్ల భూమి అవసరం కాగా, దీంట్లో 17.69 హెక్టార్ల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కూడా సింగరేణికి బదలాయించాల్సి ఉంది.
- ఈ బ్లాక్ నుంచి వెలికితీసిన బొగ్గును జరపడ రైల్వే సైడింగ్ ద్వారా రవాణా చేస్తారు. ఇందుకు సంబంధించిన రవాణా కాంట్రాక్ట్‌ను కూడా సింగరేణి ఖరారు చేసింది. నైనీ సమీపంలోని చండిపడ నుంచి జరపడ సైడింగ్ వరకు ఆర్అండ్బీ రోడ్డు వేయాల్సి ఉంది. ఇందుకోసం రూ. 35.25 కోట్లను సింగరేణి ఇప్పటికే ఆర్‌అండ్‌బీకి చెల్లించింది. ఈ పనులింకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
- నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి జరగాలంటే చండిపడ వరకు హెచ్‌టీ విద్యుత్తు లైన్‌ను నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ. 9.25 కోట్లను కేటాయించింది. ఈ పనులింకా ప్రారంభం కాలేదు.
- ఈ గని నుంచి వెలికితీసిన బొగ్గును థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికే వినియోగించనున్నారు. నైనీ సమీపంలోనే 1600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని సింగరేణి సంస్థయే నిర్మించనుంది. ప్లాంట్ నిర్మాణానికి స్థలం కేటాయింపు, ఇతర అనుమతులు రావాల్సి ఉంది. ఇవి కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

