నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 7768 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 20 706 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 37334 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు 878.30 అడుగుల వద్ద 179.5130 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 25219 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.