నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సెక్షన్ 280 బీఎన్ఎస్ఎస్ ప్రకారం కేసును విత్‌డ్రా చేసుకుంటున్నట్టు నాగార్జున కోర్టుకు పిటిషన్ సమర్పించారు. ఈ విచారణకు మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమె తరఫున న్యాయవాది గైర్హాజరు పిటిషన్‌ను కోర్టుకు సమర్పించారు. నాగార్జున తరఫున కూడా గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జునతోపాటు ఆయన కుంటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తాజాగా సురేఖ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసు విచారణన వచ్చేనెల 11కు వాయిదా పడింది. ఈ కేసులో సాక్ష్యాధారలను పిటిషనర్ కోర్టు సమర్పించారు.