శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 10:59:23

సాగ‌ర్‌కు త‌గ్గిన వ‌ర‌ద‌.. క్ర‌స్టు గేట్లు మూసివేత‌

సాగ‌ర్‌కు త‌గ్గిన వ‌ర‌ద‌.. క్ర‌స్టు గేట్లు మూసివేత‌

హైద‌రాబాద్‌: నాగార్జున సాగ‌ర్‌కు ఎగువ‌నుంచి వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గిపోయింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్ల‌ను మూసివేశారు. ప్ర‌స్తుతం జ‌లాశ‌యంలోకి 46,077 క్యూసెక్యుల నీరు వ‌స్తున్న‌ది. అంతేమొత్తంలో నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 312.04 టీఎంసీలుకాగా, ఇప్పుడు 310.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు. 

శ్రీశైలం జ‌లాశ‌యానికి కూడా వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 55,246 క్యూసెక్కుల నీరు వ‌స్తుండ‌గా, 55,185 క్యూసెక్యుల నీటిని వ‌దుల‌తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 885 అడుగులుకాగా, 884.7 అడుగుల వ‌ర‌కు నీరు నిల్వ ఉన్న‌ది. జ‌లాశ‌యం పూర్తి సామ‌ర్థ్యం 2158 టీఎంసీలు, ప్ర‌స్తుతం 2138 టీఎంసీల నీరు ఉన్నది. కుడిగ‌ట్టు జ‌లవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్ప‌త్తి కొన‌సాగుతున్న‌ది.