నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 51,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లో ప్రస్తుతం 589.7 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, 311.04 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది.