Maha Shivratri | మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన ఈ శివాలయాల సందర్శన యాత్రకు విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యాత్ర నిర్వహించారు.
ఈ భక్తి యాత్రలో భాగంగా సింగపూర్‌లో ఉన్న 9-12 ప్రముఖ శివాలయాలను సందర్శించడం జరిగింది. ఈ యాత్ర నిర్వహించడానికి సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్, టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుంచి బస్సులను సమకూర్చి యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమశివుని దీవెనలు పొందారు. ఈ మహాశివరాత్రి మరుసటి రోజు సింగపూర్‌లో ఉద్యోగులకు పనిరోజు అయినప్పటికీ ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులు భక్తుల శివనామ స్మరణతో మార్మోగాయి.

Singapore2
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి, ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ సానుకూల అభిప్రాయాన్ని కృతజ్ఞతల రూపంలో వాట్సాప్ మాధ్యమంలో తెలియజేసి అభినందించారు. భక్తుల సానుకూల స్పందన కమిటీ సభ్యులను భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రోత్సహించింది. ఎలాంటి లాభాపేక్ష , ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

Singapore3
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము వ్యవహరించారు. వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్‌కు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Singapore4
ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.