హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ వివాహితతో ఆయనకు సన్నిహిత పరిచయం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
2014లో వివాహమై 2023 నుంచి భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళను ఉదయ్ ‘లివ్-ఇన్ రిలేషన్షిప్’లో ఉందామని ఉదయ్ కోరాడని, భర్త నుంచి చట్టబద్ధంగా విడాకులు లభించకపోవడంతో ఆమె ఉదయ్ కోరికను తిరసరించారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం.