Nadargul Lands | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): నాదర్గుల్ భూముల కబ్జా వివాదం లో అడుగుతున్న ప్రశ్నలు ఒకటైతే, సంబంధిత కోహినూర్ కంపెనీ చెప్తున్నదని మరొకటిగా ఉన్నది. ఎట్టకేలకు ఆ భూములు ప్రభుత్వానివేనని ఒప్పుకొన్నది. వివాదం కోర్టు లో ఉన్నదని తెలుపడమేగాక, మంత్రి కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ఆదివా రం ప్రకటన విడుదల చేసింది.
అంతేకాదు.. కోర్టు వివాదంలో ఉన్న అంశాలపై మీడియా వార్తలు రాయొద్దంటూ సుద్దులు చెప్పింది. అయితే మరి కోర్టు వివాదంలో ఉన్న భూమి వద్దకు ఎందుకు వెళ్లినట్టు? రైతులతో అనధికార ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్న ట్టు? తమకే చెందినవైతే ఆర్డీవో వద్దకు వెళ్లి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్ర శ్నలకు మాత్రం సదరు కంపెనీ జవాబు చె ప్పకపోవడం గమనార్హం.
7వేల కోట్ల విలువైన భూ కబ్జా అంశంపై రెండు రోజులుగా చెలరేగుతున్న వివాదంపై తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు బాధిత రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో స్కామ్‌పై ఆధారాలను బయటపెట్టారు. దీంతో తాజాగా కో హినూర్ కంపెనీ స్పందించింది. భూమికి సంబంధించిన ఆరోపణలను ఖండిస్తూ ప త్రికా ప్రకటన విడుదల చేసింది. ఏక్యూ స్వేర్ రియల్టర్, క్రిస్టల్ మాన్షన్స్ ప్రైవేట్ లి మిటెడ్ కంపెనీలు కోహినూర్ గ్రూప్ సిస్టర్ గ్రూప్ కంపెనీలని వెల్లడించింది. కంపెనీలకు మంత్రి కుమారుడు హర్షారెడ్డికి సంబంధం లేదని తెలిపింది. 2023 జనవరిలోనే కంపె నీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, గ్రూ ప్ ఆఫ్ డైరెక్టర్లు సైతం దానిని ఆమోదించారని పేర్కొన్నది. ఆ భూములు శివరాజ్ బ హదూర్కు చెందినవేనని 2015లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపింది.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్-1975లోని సెక్షన్ 27 ప్రకారం సీలింగ్ పరిధిలోకి వచ్చే భూములకు ఇంజక్షన్ ఆర్డర్లు వర్తించబోవనే ది ఉన్నది. 1982లో సుప్రీంకోర్టు తమిళనా డు వర్సెస్ అథారిటీస్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఇంజెక్షన్ ఆర్డర్లు చెల్లవు. పోడు కరాబు భూములు (వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు) అని కంపెనీ చెప్తున్నది. కానీ ఏడు దశాబ్దాలుగా నాదర్గు ల్ రైతులు అందులో వ్యవసాయం చేస్తున్నా రు. హరీశ్ ప్రెస్‌మీట్‌లోనూ పలువురు మ హిళా రైతులు సైతం ఇదే విషయాన్ని చెప్పా రు. సదరు భూముల్లోని లచ్చమ్మకుంట కిం ద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. గ తంలో రైతులకు ఇందిరా ఆవాస్ యోజన కింద బోరు బావులు ఏర్పాటు చే సుకునేందుకు కేంద్రం ఆర్థిక సాయం కూడా చేసింది. ఇవన్నీ అక్కడ వ్యవసాయం కొనసాగుతున్నందుకు ఆధారాలు. కానీ సదరు కంపెనీ మాత్రం అవి వ్యవసాయానికి పనికిరావని చెప్పడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని చెప్తున్న సదరు కంపెనీ, మ్యుటేషన్ ఎందుకు చేయించుకోలేదో? చెప్పలేదు. ఆర్డీవో వద్ద డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడం లేదనేదానికీ సమాధానం చెప్పలేదు. వార్తలు రాయవద్దని చెప్తున్న కంపెనీయే రైతులతో అనధికార అగ్రిమెంట్లు ఎందుకు చేసుకుంటున్నదో? కూడా సమాధానం చెప్పలేదు.
ఇదిలా ఉంటే కొత్వాల్‌గూడ క్రషర్ అ క్ర మ మైనింగ్ వ్యవహారంలో మంత్రి పొంగులేటి కుమారుడు, కుటుంబీకుల పేర్లు తెరమీదకు వచ్చాయి. దానిపై తీవ్ర వివాదం కొనసాగింది. విషయాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆధారాలతో బట్టబయలు చేసింది. ఆ వెంట నే ఓ కంపెనీ హఠాత్తుగా ముందు కొచ్చింది. మంత్రి కుమారుడికి, అక్రమ మైనింగ్‌కు సంబంధం లేదని, కంపెనీతో సంబంధం లే దని ప్రకటన విడుదల చేసింది.