బొమ్మల రామారం,ఆగస్టు 2: అమ్మవారి చల్లని చూపుతో మళ్లీ కేసీఆర్ రాజ్యం రావడం ఖాయమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్ద పర్వతాపూర్ బోనాల జాతరలో ఆమె బోనమెత్తి, అమ్మవారికి ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రాజ్యం రావాలని జనం కోరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
అనంతరం ఉప సర్పంచ్ జంగయ్య మనుమడి బారసాల కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలనర్సయ్య, పెద్దపర్వతాపూర్ సర్పంచ్ ఈగల సంతోష బాలరాజ్, ఉప సర్పంచ్ జింక నరేందర్, సర్పంచ్‌లు కూర వెంకటేశ్, డోకూరి అయిలయ్య, మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బోనంకూర మల్లేశ్, నిరుగొండ రమేశ్‌గౌడ్, సత్తిరెడ్డి, మానుక రాజు పాల్గొన్నారు.