హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొతం 91 పోస్టులు భర్తీ చేయనుండగా.. వీటిలో అసిస్టెంట్ మేనేజర్ (నాబార్డ్-ఆర్బీడీఎస్)85,అసిస్టెంట్ మేనేజర్(లీగల్ సర్వీస్)2,అసిస్టెంట్ మేనేజర్(ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్)4 ఉన్నాయి. అభ్యర్థులు నవంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నాబార్డ్ కోరింది.
టీజీ రెడ్కో అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (టీజీ రెడ్కో) అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించింది. tgredco. telangana.gov.in వెబ్సైట్ ద్వారా క్యాటగిరి-1 నుంచి 11 వరకు గల బాధ్యులు దరఖాస్తులు సమర్పించాలని కోరింది.