Meenakshi Natarajan | తెలంగాణ రాజ్యసభ సీటు వద్దు.. మీరు ఇచ్చినా నేను తీసుకోను.. తేల్చిచెప్పేసిన మీనాక్షి నటరాజన్
Meenakshi Natarajan | తెలంగాణ నుంచి రాజ్యసభలో తాను అడుగుపెట్టబోనని, తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఒక వేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని ఐఏసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తేల్చిచెప్పారు.
Meenakshi Natarajan |హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ నుంచి రాజ్యసభలో తాను అడుగుపెట్టబోనని, తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఒక వేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని ఐఏసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తేల్చిచెప్పారు. తన రాజకీయం మధ్యప్రదేశ్‌లోనే ఉంటుందని స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ సీటు కోసం తాను దాఖలు చేసిన నామినేషన్ తిరసరణకు గురికావడం, తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపటానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఆమె మీడియా ముందుకు వచ్చారు. గాంధీ భవన్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఒకరితో రాజీనామా చేయించి రాజ్యసభ సీటు తీసుకునే అవసరం తనకు లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
నాపై బీజేపీ అబద్ధాలు
నామినేషన్ తిరసరణపై తాను ఇప్పటి వరకు తకువ మాట్లాడానని, ఈ అంశం కోర్టులో ఉండటంతో మాట్లాడలేదని మీనాక్షి చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉంటే ఒక స్థానానికి 58 సభ్యులు కావాలని తెలిపారు. కాంగ్రెస్ బలం ఉన్నదని అధిష్ఠానం తనకు టికెట్ ఇచ్చిందని, కానీ బీజేపీకి మూడో స్థానానికి అవకాశం లేకపోయినా ఫౌల్ గేమ్ ప్లాన్ చేసిందని విమర్శించారు. డబ్బులు, బెదిరింపులతో మూడో స్థానం రాదని బీజేపీ గ్రహించిందని, అందుకే తన విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చానంటూ వస్తున్న వార్తలపై మీనాక్షి స్పష్టతనిచ్చారు. తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని, అసలు నామినేషన్ పత్రంలో లీగల్ నోటీస్‌కు సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఎకడా లేదని వివరించారు. లేని కాలమ్‌ను సాకుగా చూపి, సాంకేతిక కారణాల పేరుతో తన నామినేషన్‌ను తిరసరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. కావాలనే బీజేపీ తనపై అబద్ధాలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
ఓటు చోరీ..సీటు చోరీ
కుంభం శివకుమార్ ఇష్యూలో కేసు సీరియస్ అని గ్రహించి నారాయణపేట టికెట్ ఇవ్వలేదని, కుంభం శివకుమార్‌పై ఎలాంటి కేసూ ప్రూవ్ కాలేదని, చార్జ్‌షీట్ లేదని మీనాక్షి తెలిపారు. ఒక వ్యక్తిపై ఉన్న అభియోగాలకు కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వకూడదని ఎకడా లేదని, రాజ్యసభ తిరసరణ విషయంలో ఒక నిమిషం కూడా నిరాశ చెందలేదని వివరించారు. బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేసిందో దేశానికి చూపించామని తెలిపారు. ఓటు చోరీ, సీటు చోరీ జరుగుతున్నదని రెండేండ్లుగా రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

