హైడ్రా కమిషనర్ తొలగింపు ఆదేశాలపై సంబురాలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను విధుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కుత్బుల్లాపూర్ నియోజకర్గం లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మంగళవారం పేట్ బషీరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కా లనీల సంక్షేమ సంఘాల ప్రతినిధుల నేతృత్వంలో పటాకులు కాల్చి హైకోర్టు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
- కుత్బుల్లాపూర్‌లో హైకోర్టు చిత్రపటానికి క్షీరాభిషేకం
- పూర్తిగా విధుల నుంచి తప్పించాలని ప్రజల వేడుకోలు
అమీన్పూర్(జిన్నారం)/ కుత్బుల్లాపూర్, జూలై 28 : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను విధుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కుత్బుల్లాపూర్ నియోజకర్గం లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మంగళవారం పేట్ బషీరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కా లనీల సంక్షేమ సంఘాల ప్రతినిధుల నేతృత్వంలో పటాకులు కాల్చి హైకోర్టు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయాన్ని కాపాడిన హైకోర్టుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్ సర్కిల్ పరిధిలోని ఆయా గ్రామాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతూనే ఉన్నారు. రెండేండ్ల క్రితం కిష్టారెడ్డిపేటలోని మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేయించారు.
పటేల్‌గూడ పరిధిలో 2024 సెప్టెంబర్ 22న బీఎస్ఆర్కాలనీలో 22 ఇండిపెండెంట్ ఇండ్ల ను కూల్చివేయించారు. లోన్లు తీసుకొని ఇం డ్లు కొన్నామని, ఇండ్లు లేకపోవడంతో రోడ్డున పడుతామని, తమ చిన్నారుల భవిష్యత్తు ఆగమవుతుందని మొత్తుకున్నా అధికారులు స్పం దించలేదు. ఏప్రిల్ 12న ఐలాపూర్ పరిధిలోని ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేయించా రు. ఈ భవనంలో నివాసం ఉంటున్న 40 కు టుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుం డా.. ఖాళీ చేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం రేపింది. ఐలాపూర్ తాండాలోని 14 నిర్మాణాలను పోలీసులను మోహరించి కూల్చివేయించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా రంగనాథ్‌ను విధుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించటంతో బాధితులు హర్షం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

