శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ‘నోటరీ పరశురాం’ అనేది ఉపశీర్షిక. అనన్యశర్మ, ముఖేష్‌రుషి, స్నేహాల్, సమీర్ కీలక పాత్రధారులు. సంతోష్ అయ్యప్పన్ దర్శకుడు. రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత. 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 31 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్‌ని నిర్వహించారు.
‘దర్శకుడు క్లారిటీతో ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో నాకు మంచి పాత్ర దొరికింది. టోటల్ అవుట్‌పుట్ చూశాక ఫిదా అయ్యాం. ప్రతి పాత్రలోనూ మంచి ఎలివేషన్ ఉంటుంది. చిరంజీవి ఈ సిరీస్ చూసి బావుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని నటుడు శ్రీకాంత్ అన్నారు. దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ మాట్లాడుతూ ‘కేవలం 19రోజుల్లో ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేశాం.
టీమ్ అంతా సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అవుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల, నటులు ముఖేష్ రిషి, అనన్యశర్మ, సమీర్, నారాయణ హరిచంద్ర, జెమినీ సురేశ్ కూడా మాట్లాడారు.