కొండాపూర్, సెప్టెంబర్ 4: వినాయక ఉత్సవాల్లో భాగంగా రాయదుర్గంలోని మైహోం భుజాలో నిర్వహించిన వేలంపాట లో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికిం ది. రూ. 51,77,777కు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గణేశ్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కొండపల్లి గణేశ్ దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ గతేడాది రూ. 29 లక్షలకు లడ్డూను కైవసం చేసుకోగా, వ్యాపారంలో ఆశించిన స్థాయికంటే మెరుగైన లాభాలు వచ్చాయని, అందుకే ఎంతమంది వేలం పాటలో పోటీకి వచ్చినా లడ్డూను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. లడ్డూను మైహోం భుజా నివాసితులతోపాటు తన స్వగ్రామంలోని ప్రజలకు అందజేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.