హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగోన్నతి అనేది హోదా పెరుగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యత, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సీఐ హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగోన్నతి పొందిన 36 మంది అధికారులకు వివిధ జిల్లాలు, యూనిట్లలో పోస్టింగ్‌లు కల్పించారు.
కాగా, పోస్టింగుల కోసం వేచి చూస్తున్న 36 మంది సివిల్ డీఎస్పీ, ఏసీపీ అధికారులను కొత్త స్థానాల్లో నియమిస్తూ డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 మంది నాన్‌క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయెల్ ఉత్తర్వులు జారీచేశారు.