Ganesh Laddu | కాసిపేట, సెప్టెంబర్ 5 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో శుక్రవారం వినాయక మండపాల వద్ద నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో పాట పాడి ముస్లిం సోదరులు లడ్డూలను వేలం పాటలో దక్కించకున్నారు. దేవాపూర్ పాత అంగడిబజార్ వద్దలోని బాల గణేష్ మండపం వద్ద ఎండీ షజీర్ రూ.8,500లకు దక్కించుకోగా స్వచ్ఛందంగా రూ.10,000 ప్రకటించారు. మరో మండపం వద్ద ఎండీ ఇమ్రాన్ రూ.6,500లకు వేలం పాట పాడి లడ్డూను దక్కించుకోగా స్వచ్ఛందంగా రూ.8000 ఇస్తామని ప్రకటించారు. ఇక్కడ ఇంకో ప్రత్యేక ఉంది. వినాయక కొలువు దీరిన సమయంలో ఇక్కడ లడ్డూని ఎండీ ఖదీర్ 6 కిలోల లడ్డూను తయారు చేయించారు. మరో చోట షజీర్ 5 కిలోల లడ్డూ చేయించారు. గణేష్ దేవుడిని అంటే మాకు ఇష్టమని, నమ్మకం ఉందని, ఇక్కడ ముస్లిం, హిందువులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని వారు స్పష్టం చేశారు.