Mallik Teja | జగిత్యాల టౌన్, మే 30: జయ జయహే తెలంగాణ గేయానికి సంగీతం అందించే బాధ్యతను తనకు అప్పగిస్తానని తొలుత హామీఇచ్చిన కవి అందెశ్రీ ఇప్పుడు మాట తప్పారని కవి, సంగీత దర్శకుడు మల్లిక్ తేజ వాపోయారు. ఎన్నికల ముందు ఏడాది క్రితం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్ర సమయంలో హడావుడి చేసి ఒక్క రోజులోనే ‘జయ జయహే తెలంగాణ’ పాటకు రూపకల్పన చేయాలని కొరియోగ్రాఫర్ అంతడుపుల నాగరాజన్నను కోరారని, ఆయన ఈ పాటను తనకు అప్పగించారని గుర్తు చేశారు.
దాన్ని చాలెంజ్‌గా తీసుకొని క్రిటికల్ సమయంలో డబ్బులు ఆశించకుండా ఒక్క రోజులోనే పని పూర్తి చేశానని చెప్పారు. భవిష్యత్తులో ఈ పాటను ఉన్నత ప్రమాణాలతో రూపొందించే అవకాశాన్ని ‘నీకే కల్పిస్తాం’ అని మాట కూడా ఇచ్చారని పేర్కొన్నారు. కవి అందెశ్రీ కూడా ఈ పాట విని అద్భుతంగా చేశావని ప్రశంసించారని గుర్తుచేశారు. ఈ పాటను మళ్లీ అద్భుతంగా చేద్దామని చాలాసా ర్లు తనతో అన్నారని తెలిపారు. ఇప్పు డు తర్వాత తమలాంటి వాళ్లకు అవకాశమిస్తే మరింత ప్రేమతో పనిచేసే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు మాట తప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మల్లిక్ తేజ చెప్పారు.