Gurukula Hostels | నర్సాపూర్, జూలై 12: గురుకులాల్లో ఎలుకలు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలూ తేడా లేకుండా గదుల్లోకి వచ్చి విద్యార్థులను కొరుకుతున్నా యి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేటలోని గురుకుల హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన మరువక ముందే మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గురుకులంలోనూ విద్యార్థులను కరిచాయి. నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకులం లో విద్యనభ్యసిస్తున్న నలుగురిని శుక్రవారం ఎలుకలు కరిచాయని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా.. విద్యార్థులతో విలేకరులు మాట్లాడకుండా గురుకు ల సిబ్బంది అడ్డుపడ్డారు. గదిలో చెత్తాచెదా రం ఉండటంతో రోజూ ఎలుకలు వస్తున్నాయని కొందరు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు ఏఎన్ఎంతో ప్రథమ చికిత్స చేయించారని సమాచారం. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా.. అలాంటి సంఘటన ఏమీ జరగలేదని చెప్పడం విశేషం.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
రామాయంపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో బాలికలను ఎలుకలు కొరికిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సాంఘిక సం క్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌కు మెదక్ మాజీ ఎమ్మెల్యే పి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేశా రు. శుక్రవారం సచివాలయంలో శ్రీధర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.