నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మునుగోడు మండలం కొరటికల్ నుంచి ఇవాళ ప్రభాకర్ రెడ్డి ప్రచారాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం నేతలు, శ్రేణులు కూడా హాజరయ్యారు . అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చండూరులో వామపక్ష నేతలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపధ్యంలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.