నల్లగొండ, అక్టోబర్ 20: మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగులుతున్నది. ఇటీవల డబ్బులతో మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్న వారు తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు. గురువారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో రెండు పార్టీలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. కుటుంబ స్వార్థం కోసం మునుగోడును, నల్లగొండ జిల్లాను బలిచేసిన దుర్మార్గులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని దుయ్యబట్టారు. అభివృద్ధి నమూనాతోపాటు సంక్షేమ రంగంలో కూడా తెలంగాణను ముందువరుసలో ఉంచిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు వచ్చిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మునగోడు జడ్పీటీసీ నారబోయి న రవి ముదిరాజ్, సూర్యాపేట జడ్పీ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, పల్లె రవి గౌడ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారు..
టీఆర్ఎస్లో చేరిన వారిలో మునుగోడు నియోజకవర్గ బీజేపీ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, ఓబీసీ జిల్లా సంయుక్త కార్యదర్శి మాదగోని నరేందర్‌గౌడ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ మాజిద్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి పందుల రాజేశ్, దళిత మోర్చా నియోజకవర్గ కన్వీనర్ నీరుడు రాజారామ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు ముచ్చపోతుల స్రవంతి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మండల కార్యదర్శి జడీమెట్ల రమేశ్ ఉన్నారు. చండూర్ మం డలం నుంచి.. చండూరు మాజీ ఎంపీటీసీ తిరందాసు అనిత ఆంజనేయులు, షేరిగూడెం బీజేపీ ఉప సర్పంచ్ పంకర్ల వెంకటేశ్, మర్రిగూడ మండలం లంకెలపల్లి సర్పంచ్ పాక్ నగేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పగిళ్ల రాజశేఖర్, శివన్నగూడెం నుంచి రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు, ఎంపీటీసీ గండికోట హరికృష్ణ చేరారు. మునుగోడు మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఇటీవల రాజగోపాల్‌రెడ్డితోపాటు బీజేపీలో చేరిన జూనియర్ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఐతగొని విజయ్ కూడా టీఆర్ఎస్లో చేరారు. బీజేపీతో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని, అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు 25 ఏండ్లుగా బీజేపీలో పనిచేస్తున్న పలువురు పేర్కొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే మునుగోడుకు నిధులు వచ్చాయని, ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. అభివృద్ధిని చూసే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.