గద్వాలలో ఫలితం తారుమారు
గద్వాలలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా మున్సిపాలిటీని హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నించడం పలు విమర్శలకు తావిచ్చింది. మున్సిపాలిటీలోని 8వ వార్డుపై కౌంటింగ్ హాల్లో హైడ్రామా నడిచింది.
- ఎమ్మెల్యే బండ్ల దౌర్జన్యకాండ
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గద్వాలలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా మున్సిపాలిటీని హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నించడం పలు విమర్శలకు తావిచ్చింది. మున్సిపాలిటీలోని 8వ వార్డుపై కౌంటింగ్ హాల్లో హైడ్రామా నడిచింది. మొదట అధికారులు 3 ఓట్లతో.. ఆ తర్వాత ఒక ఓటుతో బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ గెలిచిందని ప్రకటిం చారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ రీ కౌంటింగ్ కోరగా అధికారులు నిర్వహించారు.
చెల్లని బ్యాలెట్ ఓటు కింద ఉన్న ఓటును తీసి కాంగ్రెస్‌కు ఆర్వో కలపడంతో ఫలితం తారుమారైంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ ఒక్క ఓటుతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి తిరిగి రీకౌంటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా వారిని బయటకు పంపారు. శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు హన్మంతునాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి కౌంటింగ్ హాల్ బ యట బైఠాయించారు. కాగా మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా నాలుగు స్థానాలు ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్లు.. మరో ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బలవంతంగా క్యాంప్‌నకు ఎత్తుకెళ్లింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

